హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం షెడ్యూల్ ఇదే..!

ASR: సీఎం చంద్రబాబు ఈనెల 29వ తేదీన అరకులోయ మండలం గన్నెల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే పర్యటన మధ్యాహ్నం 3గంటలకు ముగియనుందని జిల్లా అధికారులు తెలిపారు. గన్నెల హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం ఆర్‌కేనగర్‌లో సంజీవని కార్యక్రమ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ప్రజా వేదిక సమావేశంలో పాల్గొని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.