హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కనిగిరిలో కరెంట్ బంద్

ప్రకాశం: కనిగిరిలో టవర్ వర్క్ కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలోని శంఖవరం, కనకపట్నం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.