మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. గురువారం జర్మనీపై 3-1 తేడాతో గెలిచి టోర్నీలో ఐదో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున ఇషికా 43వ నిమిషంలో, నవ్నీత్ 44, 46వ నిమిషాల్లో గోల్స్ చేశారు. జర్మనీ తరఫున లిన్ క్రింగ్స్ 59వ నిమిషంలో గోల్ సాధించింది. 1974 తర్వాత ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
క్రీడలు
జర్మనీని చిత్తు చేసిన భారత్


