హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఎన్జీవోలు ధర్నాకు హరీష్ రావు మద్దతు

HNK: నగరంలోని కలెక్టరేట్‌ వద్ద టీఎన్జీవోలు నిర్వహించిన ధర్నాలో మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొని మద్దతు తెలిపారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడినుంచి తరలించారు. ఈ క్రమంలో ధర్నా శిబిరం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై BRS శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, BRS శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.