KNR: రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు, కుటుంబ సభ్యులు స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో బస్టాండ్ కిక్కిరిసింది. ఉదయం నుంచే ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో బస్టాండ్ పరిసరాలు సందడిగా మారాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులను అందుబాటులో ఉంచారు.
తెలంగాణ
VIDEO: రాఖీ పండుగ కోసం బస్టాండులో ప్రయాణికుల రద్దీ


