హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌పై విద్యార్థులకు పోలీసుల అవగాహన

KDP: జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పోలీస్ కళా-జాగృతి బృందం విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించింది. నాటికలు, పాటల ద్వారా మత్తుపదార్థాల అనర్థాలను వివరించారు. డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. సమాచారం ఉంటే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.