హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌర్ణమి సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ

MDK: ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.