హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి: కలెక్టర్

హన్మకొండ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన గురువారం జరిగింది. అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేని వ్యక్తులు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.