హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

SDPT: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హుస్నాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం వెంకన్న తెలిపారు. కరీంనగర్, హుజూరాబాద్, సికింద్రాబాద్, జనగామ తదితర మార్గాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.