హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పరుపు మార్చరు.. టిఫిన్‌లు పెట్టరు'

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సరైన సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం అందించాల్సిన టిఫిన్లు నిలిచిపోయాయని రోగులు వాపోతున్నారు. పరుపుల కవర్లు రోజూ మార్చాల్సి ఉండగా, వారం రోజులుగా తొలగించకపోవడంతో దోమల బెడద పెరిగిందని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.