హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన

కోనసీమ: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రీవెన్షన్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సపై అవగాహన కల్పించారు. హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో బుజ్జిబాబు, జి.శ్రీను పాల్గొన్నారు.