SRCL: బోయినపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భూమయ్య రాఖీ పండుగ విశిష్టత, సోదరసోదరీ బంధం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెలంగాణ
బోయినపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా రాఖీ వేడుకలు


