WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వరుసగా మూడు రోజులు బంద్ ఉండనుంది. శుక్రవారం రాఖీ పండుగ, శని, ఆదివారం వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ మూడు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచించారు. సెలవులు అనంతరం మార్కెట్ తెరిచి ఉంటుదని తెలిపారు.
తెలంగాణ
ఎనుమాముల మార్కెట్‌కు వరుస సెలవులు


