హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకు ఉద్యోగుల భారీ నిరసన

NTR: నందిగామ గాంధీ సెంటర్‌లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు గురువారం నిరసన చేపట్టారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు, వార్షిక ఆదాయంలో ఉద్యోగులకు సమాన వాటా, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ తదితర డిమాండ్లతో ఆందోళన చేశారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు బ్యాంకుల సిబ్బంది పాల్గొని డిమాండ్లు అమలు చేయాలని నినాదాలు చేశారు.