హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలాసలో యూటీఎఫ్ బైక్ ర్యాలీ

SKLM: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్ గురువారం డిమాండ్ చేశారు. పలాసలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో మాట్లాడారు. 2010 ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సెప్టెంబర్ 3న చలో విజయవాడ, 4 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామన్నారు.