హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బీబీనగర్ ఏయిమ్స్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు'

BHNG: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.