హైదరాబాద్: 28°C
తెలంగాణ

విలీన గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

MLG: ములుగు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను పట్టణ ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. గురువారం బండారుపల్లిలో రూ.5.50 కోట్లు, జీవంతరావుపల్లిలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాలను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నిరంతరం పర్యవేక్షిస్తానని అన్నారు.