హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల దాడి.. రూ.2.20 లక్షల గుట్కా స్వాధీనం

WGL: నర్సంపేట పట్టణంలోని నవదుర్గ ఎంటర్‌ప్రైజెస్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. షాపు యజమాని పరమార్ పూరన్ సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.