హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ ఉత్సవాల్లో సందడి చేసిన ఎమ్మెల్యే దొంతి

WGL: నెక్కొండ మండలంలో బంజారా సేవాలాల్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. తీజ్ ఉత్సవాలు బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.