PDPL: మంథని పట్టణంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. గురువారం పట్టణానికి చెందిన పురోహితుడు బొరగారి రాజు పూజా కార్యక్రమం ముగించుకుని బైక్ పై తిరిగి వస్తుండగా కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ క్రమంలో ఓ కోతి బైక్ టైర్ లో ఇరుక్కుపోవడంతో అదుపు తప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
కోతుల దాడిలో పురోహితుడికి గాయాలు


