హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం

NTR: ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణకు ఉత్తమ మార్గమని క్రాంతి హైస్కూల్ అధినేత వెనిగళ్ల మురళీమోహన్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, కొండపల్లి ఆయుర్వేద వైద్యశాల, క్రాంతి హైస్కూల్ సంయుక్తంగా గురువారం ఇబ్రహీంపట్నంలో ఉచిత ఆయుర్వేద శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.