హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రధాన రహదారిపై భారీ వాహనాలు నిలపొద్దు'

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై, వ్యాపార సంస్థల వద్ద భారీ వాహనాలను నిలపరాదని ఎస్సై నరేష్ తెలిపారు. రహదారి పక్కన దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు పోలీస్‌స్టేషన్‌లో అవగాహన కల్పించారు. రహదారులపై వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు, వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు.