హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల వసతి గృహంలో తహసీల్దార్ తనిఖీ

NZB: మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రవీందర్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, వసతి సౌకర్యాలపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పరిసరాలను పరిశీలించి, భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వసతి గృహం చుట్టూ పెరిగిన పొదలు, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని సూచించారు.