ములుగు మండలం బంజరుపల్లి నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన మంత్రి.. గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి


