హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు

SDPT: బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా నిర్వహించారు. మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు ఎస్సై తోట తిరుపతి, సిబ్బందికి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీసు కుటుంబంలో సోదరసోదరీల అనుబంధాన్ని పెంపొందించేలా వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిబ్బంది పేర్కొన్నారు.