హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

PPM: పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు గురువారం గరుగుబిల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. దర్యాప్తు విషయంలో సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.