హైదరాబాద్: 28°C
తెలంగాణ

చట్టబద్ధమైన దత్తతతే సురక్షితం: కలెక్టర్

MDK: చట్టబద్ధమైన, దత్తత విధానమే బాలలకు సురక్షితమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో 'మిషన్ వాత్సల్య' ద్వారా హైదరాబాద్‌ దంపతులు, బాలల సదన్‌కు చెందిన 11 ఏళ్ల బాలికను అధికారికంగా దత్తత తీసుకున్నారు. అక్రమ దత్తతలు నేరమని, దళారులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. డబ్ల్యూవో హేమా భార్గవి, డీసీపీవో నాగరాజు పాల్గొన్నారు.