MDK: తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రభావతి, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ప్రభుత్వ కళాశాలలో వనమహోత్సవం


