TPT: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలో నాగపట్ల ఈస్ట్ బీట్ పరిధిలోని కళ్యాణీ డ్యాం వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండగా అటవీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడల్లో దుండగులు పరారయ్యారు. ఆప్రాంతంలో కారును తనిఖీ చేయగా అందులో 15 ఎర్రచందనం దుంగలు దొరికాయి. దీంతో కారుతో సహ ఎర్రచందనం దుంగలు విలువ రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణీ డ్యాం సమీపంలో భారీగా ఎర్రచందనం స్వాధీనం


