హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు

NRML: కల్తీ పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత తెలిపారు. నిర్మల్ పట్టణంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రాఖి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన రాఖీ షాపుల వద్ద ఉన్న తినుబండారాలను తనిఖీ చేశారు. వ్యాపారులు వాటిని తయారు చేసే ప్రదేశాలను తెలుసుకొని తనిఖీ చేసి నోటీసులు జారీ చేయడంతో పాటు వారి దగ్గర నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించారు.