హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన

విజయనగరం పట్టణంలో గురువారం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు నూతన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతులు తమ పంటలను నేరుగా ప్రజలకు అందించేందుకు ఈ రైతు బజార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక సదుపాయం స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తుందన్నారు.