హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

BHPL: భూదార్‌ కార్డుల జారీ కోసం చేపట్టిన రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, సర్వే అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 22ఏ నిషేధిత భూములు, భూభారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.