KMR: రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో ఓటరు జాబితాపై అవగాహన కల్పించేందుకు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుద్దాల లింగం, ఉపసర్పంచ్ గండ్ర అంజయ్య, జీపీఓ కిషన్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పోసానిపేటలో ఓటరు జాబితాపై అవగాహన'


