హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి అర్హుడికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం

JGL: ప్రతి అర్హుడికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని సర్పంచ్ లావుడియా జ్యోతి సంతోష్ అన్నారు. గురువారం రాయికల్ మండలం అలియానాయక్ తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. ప్రజలంతా వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వార్డు సభ్యులు సతీష్, వసంత్, శిల, జీపీవో లావణ్య, టీచర్లు విజయ, నిరోజ, గంగాధర్, పూనమ్ పాల్గొన్నారు.