భూపాలపల్లి నియోజకవర్గంలో రక్షాబంధన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి షైన్ స్కూల్ విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆడబిడ్డల ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని అన్నారు. వారి కష్టనష్టాల్లో తోబుట్టువులా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్న చెల్లిల బంధం ఎన్నటికి విడిపోదని తెలిపారు.
తెలంగాణ
రక్షాబంధన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి


