హైదరాబాద్: 28°C
వార్తలు

హాస్టల్ వార్డెన్‌పై SFI ఫిర్యాదు

KRNL: ఆదోనిలోని మంత్రాలయం బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. గురువారం సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి మాదప్పకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. హాస్టల్లోని ఒక విద్యార్థినిని తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇతర వ్యక్తులతో బయటకు పంపించడం బాధ్యరాహిత్యమన్నారు.