హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్‌లో తాగు నీరు బంద్

NDL: డోన్‌లో రేపు ఎల్లుండి త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కసిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. గాజులదీన్నే ప్రాజెక్ట్ నుండి డోన్ పట్టణానికి సరఫరా చేసే పైప్ లైన్ కోయిలకొండ చిట్యాల మధ్యలో లీకేజీతో మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని 30వ తేదీ నుంచి సరఫరా ఉంటుందన్నారు.