GNTR: తెనాలి 25వ వార్డులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రజలతో మాట్లాడి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి పర్యటన


