హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురేఖ–రేవంత్ రాఖీ బంధం కొనసాగుతుందా?

WGL: ఈసారి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో సురేఖ, రేవంత్ మధ్య రాజకీయ విభేదాలపై చర్చ మొదలైంది. ఈ వివాదం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో.. రాఖీ పండగ సందర్భంగా వీరిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో రేవంత్‌కు సురేఖ రాఖీ కట్టిన సందర్భాలు ఉన్నాయి.