WGL: వరంగల్ జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు అన్నారు. గురువారం గాంధీభవన్ సమావేశంలో పాల్గొన్న ఆయన క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: క్రీడా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం: హనుమంతరావు


