SKLM: సోంపేట మండలం పలాసపురం, జింకిభద్ర గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి బి. నరసింహమూర్తి 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం గురువారం నిర్వహించారు. వరి నాట్లను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. డీఏపీ, యూరియాతో పాటు పోటాష్ తగు మోతాదులో వేయాలన్నారు. నీటి వసతి తక్కువ ఉన్న చోట రాగి, అపరాల సాగు మేలన్నారు.కార్యక్రమంలో సహాయకులు మౌనిక, ఐశ్వర్య, రైతులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
సోంపేట మండలంలో 'పొలం పిలుస్తోంది'


