హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిషేధిత గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

ASF: బెజ్జూర్ మండలంలో నిషేధిత గడ్డి మందును అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై సర్తాజ్ పాషా గురువారం తెలిపారు. సులుగుపల్లి గ్రామానికి చెందిన బోర్కుట్ పురుషోత్తం, డేటి సుధాకర్ అను ఇద్దరూ 20 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు క్యాన్లలో నిషేధిత గడ్డి మందును విక్రయించేందుకు తరలిస్తున్న సమయంలో పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేశామన్నారు.