హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు వర్ష సూచన

SRPT: రాబోయే 24 గంటల్లో జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని TGICCC వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఫోన్లకు అలర్ట్ సందేశాలు పంపించింది.