మంచిర్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఈ ఏడాది ఇప్పటివరకు 49 కేసులు నమోదు కాగా, 103 మందిని గుర్తించినట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు.
తెలంగాణ
మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష


