MNCL: బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన రాఖీ స్టాళ్ల వద్ద మహిళలు భారీ సంఖ్యలో గుమిగూడారు. సోదరులకు కట్టేందుకు వివిధ రకాల రాఖీలను కొనుగోలు చేస్తూ మహిళలు సందడి చేయడంతో ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి.గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో వ్యాపారులు ఆందోళన చెందగా, నేడు వాతావరణం అనుకూలించడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తెలంగాణ
బెల్లంపల్లిలో రాఖీ పండుగ సందడి.. కిక్కిరిసిన బజార్లు


