హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాంకేతిక విద్యపై దృష్టి పెట్టాలి'

MNCL: విద్యార్థులు సాంకేతిక విద్యపై దృష్టి పెట్టాలనీ జన్నారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల అధ్యాపకులు అన్నారు. కళాశాలలో మూడోదశ ప్రవేశాల నేపథ్యంలో గురువారం వారు జన్నారం మండలంలోని కలమడుగు, మురిమడుగు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉన్న వివిధ కోర్సుల గురించి ప్రజలకు వివరించారు. విద్యార్థులకు మంచి సాంకేతిక విద్య అందుబాటులో ఉందన్నారు.