కోనసీమ: మండపేట మండలం వెలగతోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ సీఐ దొరరాజు, ఎస్సై కిషోర్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిసైతే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'


