హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి: కలెక్టర్

BHNG: పంట మార్పిడిలో భాగంగా వరికి బదులు కూరగాయలు, పూలు, ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం మేడిపల్లిలోని పాలీహౌస్‌లో సాగవుతున్న జెర్బెరా, టమాటా, మిర్చి పంటలను పరిశీలించారు. ఆధునిక సాగు పద్ధతులు, బిందు సేద్యంతో తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.