హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్లవీడు పాఠశాలల్లో ఘనంగా రక్షాబంధన్

BHPL: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గొర్లవేడు ఉప మండల శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం గొర్లవేడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు రక్షాబంధనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకున్నారు. “నీకు నేను రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం దేశానికి, ధర్మానికి రక్ష” అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు తదితరులు పాల్గొన్నారు.