హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సేవా యోధులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

BHPL: కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు గురువారం సమాజ సేవకులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. పోలీసు, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, పారిశుధ్య సిబ్బంది, రైతులను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని పాఠశాల ఛైర్మన్ కరుణాకర్ రావు తెలిపారు. ఈ రాఖీ దృశ్యాలు నెటింట వైరల్ అవుతున్నాయి.